ఇండియా కరోనా అప్డేట్..కొత్త కేసులు ఎన్నంటే?

0
117

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో అందరిలోనూ భయం నెలకొంది.

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 18,257‬ మంది వైరస్​ బారినపడగా.. మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 14,553 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.30 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉంది.

మొత్తం కేసులు: 4,36,22,651‬

మొత్తం మరణాలు: 5,25,428

యాక్టివ్​ కేసులు: 1,28,690

కోలుకున్నవారి సంఖ్య: 4,29,68,533