విరాట్ కోహ్లీపై కపిల్ దేవ్ సంచలన కామెంట్స్

0
140

టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్ కూల్ ధోని తరువాత అత్యధిక అభిమానులు ఉన్న ఆటగాడు కోహ్లీ. ఇప్పటివరకు కోహ్లీ ఆట తీరు వేరు. ఈ మధ్య కోహ్లీ ఆట తీరు వేరు. అతని ఆటలో కొండంత మార్పు కనిపిస్తుంది. అలవోకగా పరుగులు తీయగలిగే ఈ మెషిన్ రన్ ఇప్పుడు రెండంకెల స్కోర్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు.

ఇదిలా కొనసాగితే వచ్చే టీ20 ప్రపంచకప్ లో అతనికి స్థానం లభించడం కష్టమే. యంగ్ ప్లేయర్లు దీపక్ హుడా, సూర్యకుమార్ కోహ్లీకి పోటీగా మారారు. ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్‌ టెస్ట్‌లోనూ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులకే పరిమితమయ్యాడు. అప్పటినుంచి విరాట్‌ను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20లలో కోహ్లీని బెంచ్‌కు పరిమితం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. వరల్డ్‌ నెం.2 బౌలర్ అశ్విన్‌ ఇంగ్లండ్‌‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు పక్కన పెట్టేశారు.. అలాంటప్పుడు ఒకప్పుడు నెంబర్ వన్ బ్యాటర్‌ కోహ్లీని కూడా టీ20 మ్యాచ్‌లకు దూరం పెట్టాలి కదా అని కపిల్ సూటిగా ప్రశ్నించాడు. ఒకప్పుడు ఆట ప్రదర్శనతోనే కోహ్లీ జట్టులో కొనసాగుతున్నాడు. అలాగే ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు కూడా తగిన అవకాశాలు ఇవ్వకపోతే వారికి జట్టు యాజమాన్యం అన్యాయం చేస్తున్నట్టే అవుతుందని కపిల్ అభిప్రాయపడ్డాడు.