గుడ్ న్యూస్..ఈఎస్ఐసీలో ఉద్యోగాల భర్తీ

0
118

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 491 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఖాళీలు ఇవే..

జనరల్ మెడిసిన్ 51, అనస్ధీసియాలజీ 40, అనాటమీ 19, బయోకెమిస్ట్రీ 14, కమ్యూనిటీ మెడిసిన్ 33, డెంటిస్ట్రీ 3, డెర్మటాలజీ 5, ఎమర్జెన్సీ మెడిసిన్ 9, ఎఫ్ టీఎం 5, జనరల్ సర్జరీ 58, మైక్రోబయాలజీ 28, ఓబీజీవై 35, ఆప్తల్మాలజీ 18, ఆర్ధోపెడిక్స్ 30, ఈఎన్టీ 17, పీడియాట్రిక్స్ 33, పాథాలజీ 22, ఫార్మకాలజీ 15, ఫిజికల్ మెడిసిన్ రిహాబిలిటేషన్ 8, సైకాలజీ 14, సైకియాట్రి 7, రేడియాలజీ 14, బ్లడ్ బ్యాంక్ 3, స్టాటిస్టిసియన్ 4, రెస్పిరేటరీ మెడిసిన్ 6 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎండీ, ఎంఎస్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్లు లోపు ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జులై 18, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.esic.nic.in/ పరిశీలించగలరు.