చుండ్రు సమస్య వేధిస్తుందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండిలా..

0
104
Dandruff in the hair. Flaky scalp. Seborrhea. Macro shot. Children's dandruff. Seborrheic dermatitis. Scales on the scalp and on the hair. ; Shutterstock ID 1019564692; Purchase Order: 4501307535; Job: B318O-005842-00; Client/Licensee: P&G

మహిళలను ప్రధానంగా వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి. వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది. వాతావరణంలో కలిగే మార్పులు, శరీరంలో హార్మోన్ల స్థాయులు, ఆయిల్​ ఫుడ్​ వంటివి వీటికి కారణమవుతాయి. మరి దీనిని తగ్గించుకోడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు, ముఖం​ వంటివి చుండ్రు చేరి జిడ్డుగా మారాయంటే..దానికి కారణం సెబోరిక్​ డర్మటైటిస్​ అని చెబుతున్నారు వైద్యులు. శరీరంలో ఆయిల్​, ఫంగస్​ ఎక్కువ కావడం వల్ల డెడ్​ స్కిన్​ ఏర్పడి.. చుండ్రు వస్తుందని అంటున్నారు. దీనికి కొన్ని రకాల షాంపూలు, ఓరల్​ ట్యాబ్లెట్లతో పరిష్కారం లభిస్తుందని వివరిస్తున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఆయిల్​ ఫుడ్​ తగ్గించుకోవాలి. వీటికి అదనంగా ఓవర్​నైట్​ యాంటీఫంగల్​ లోషన్స్​ ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు రోజువారీగా లేదా.. రోజువిడిచి రోజు వాడాల్సి ఉంటుంది. ఇంకా.. కోల్​ థార్​ యాసిడ్​, సాల్సిలిక్​ యాసిడ్​, జింక్​ పైరిథ్రోన్​ షాంపూలు చుండ్రును తగ్గిస్తాయి. వీటిని మాడుకు 5-10 నిమిషాల సేపు ఉంచి తలస్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.