ఏపీ: ఆత్మకూరు వైసిపి ఎమ్మెల్యేగా మేకపాటి విక్రం రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో మేకపాటి విక్రం రెడ్డితో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి.. వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకు ఉపఎన్నికలు జరగగా ఆయన సోదరుడు విక్రం రెడ్డి గెలుపొందారు.