Flash: మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు మరో షాక్..!

0
77

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోగా సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన షిండే వర్గానికి కాస్త ఊరట కలిగింది.