మహారాష్ట్రలో మళ్లీ జికా వైరస్ కలకలం రేపింది. పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జికా వైరస్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.