ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరి కొట్టిన విషయం తెలిసిందే. ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఇండియా ఇప్పుడు రెండో వన్డేకు సన్నద్ధమవుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా నేడు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది.
తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్‌ధావన్ ఫామ్ కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. శ్రేయాస్, పంత్, హార్దిక్ రాణించాల్సి ఉంది, జడేజా, సూర్యకుమార్ పరవాలేదనిపిస్తున్నారు. బుమ్రా, షమీ చూపిస్తున్నారు.
తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ రెండో వన్డేలో గెలిచి.. సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బట్లర్, రూట్, బెన్ స్టోక్స్, బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ దుర్బేధ్యంగా ఉంది. అయితే ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు నల్లేరు మీద నడకే.