బింబిసార నుండి ‘ఈశ్వరుడే’ సాంగ్ రిలీజ్ Video

0
106

నందమూరి కల్యాణ్‌ రామ్‌ తాజాగా నటిస్తున్న సినిమా బింబిసార. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఊహించని విధంగా రికార్డులు సృష్టిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుండి ఈశ్వరుడే సాంగ్ ను రిలీజ్ చేసారు. ‘భువి పై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగినే.. దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగినే..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రక్షకుడివో రాక్షసుడివో అంటూ తిగర్తల సామ్రాజ్యపు చక్రవర్తి బింబిసారుడి స్వభావాన్ని ఈ గీతంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ పాటకు చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చగా శ్రీమణి లిరిక్స్ అందించారు. కాలభైరవ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

 

https://www.youtube.com/watch?v=1HeieIGej6s&feature=emb_title