యువతితో ఎస్సై అసభ్య ప్రవర్తన..సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

0
89

లైంగిక ఆరోపణల కేసులో కొమురంభీం జిల్లా రెబ్బెన ఎస్సై భవాని సేన్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

అసలేం జరిగిందంటే..

కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్​ కావడానికి ఓ యువతి ఎస్ఐ భవానీ సేన్ ను ఆశ్రయించింది. తనకు స్థోమత లేదని, మెటీరియల్ ​ఉంటే ఇచ్చి సాయం చేయాలని అడిగింది. దీనిని అలుసుగా తీసుకున్న ఎస్సై యువతీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేషన్ కి వస్తే బుక్స్​ ఇస్తానని పిలిచి లైంగిక వేధింపులకు దిగాడు. దీనితో యువతీ ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.