ఇండియాలో మరో వైరస్ కలకలం రేపింది. విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి ‘మంకీపాక్స్’ సోకినట్లు కేరళ ఆరోగ్యశాఖ అధికారికంగా ధ్రువీకరించింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ కాంటాక్టులను గుర్తించామన్నారు.