ఎర్రబంగారం..చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు ధర

0
80

రైతులకు శుభవార్త. నిన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఎర్రబంగారం మెరిసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి క్వింటాకు ఏకంగా రూ. 22,800 చొప్పున పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏసీ రకం మిర్చిని అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. రావూరి సత్యనారాయణ తీసుకువచ్చిన 22 బస్తాల మిర్చిని క్వింటాలుకు రూ. 22,800 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ రేటు  మళ్లీ పంట వచ్చే వరకు ఉండాలని రైతులు కోరుతున్నారు.