రూ.50తో..రూ.36 లక్షలు మీ సొంతం..ఎలా అంటే?

0
103

ప్రస్తుతం చాలా మంది పోస్టాఫీస్ పథకాల వైపు చూస్తున్నారు. ప్రజల కోసం ఎన్నో పొదుపు పథకాలను తీసుకొచ్చింది. అందులో ఒకటి గ్రామ్ సురక్ష యోజన. పోస్టాఫీస్ గ్రామ్ సురక్ష యోజన అనేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీకి మార్చుకునే అదనపు ఫీచర్ ఉంది. దీని కింద పాలసీదారు 55, 58 లేదా 60 సంవత్సరాల వయస్సు వరకు తక్కువ ప్రీమియంలను చెల్లించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు..

గరిష్ట వయస్సు 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

కనీస హామీ మొత్తం రూ.10,000, గరిష్టంగా రూ.10 లక్షలు పొందవచ్చు. అలాగే నాలుగేళ్ల తర్వాత రుణ సౌకర్యం..

పాలసీదారు మూడేళ్ల తర్వాత సరెండర్ చేసే అవకాశం

5 సంవత్సరాల కంటే ముందు సరెండర్ చేస్తే ఈ పథకం బోనస్ కు అర్హత లేదు.

 ప్రీమియం చెల్లింపును నిలిపివేసిన తేదీ లేదా మెచ్యూరిటీ తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు ఎండోమెంట్ అస్యూరెన్స్కు కన్వర్ట్ చేసుకోలేరు, ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తి 59 సంవత్సరాల వయస్సు వరకు ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీగా మార్చవచ్చు.

ప్రీమియం చెల్లించే వయస్సు 55, 58 లేదా 60 ఏళ్లుగా ఎంచుకోవచ్చు

పాలసీని సరెండర్ చేస్తే తగ్గించిన హామీ మొత్తంపై ప్రొపోర్షనేట్ బోనస్ చెల్లిస్తారు

ప్రతి రోజు రూ.50 చెల్లించండి, రూ.35 లక్షల రిటర్న్ పొందండి అనేది పోస్టాఫీస్ గ్రామ్ సురక్ష పథకం నినాదం. గ్రామ్ సురక్ష యోజన కింద, పాలసీదారుడు ప్రతి రోజూ కేవలం రూ.50 మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా రూ.35 లక్షల వరకు రిటర్న్లను పొందవచ్చు. వ్యక్తి ప్రతి నెల పాలసీ కింద రూ.1,515 పెట్టుబడి పెడితే, అంటే దాదాపు ప్రతిరోజూ రూ.50, ఆ పాలసీ విలువ రూ.10 లక్షలు. అయితే మెచ్యూరిటీ తర్వాత ఆ వ్యక్తి రూ.34.60 లక్షల రాబడి పొందుతారు. ఒక పెట్టుబడిదారుడు 55 సంవత్సరాల కాలానికి రూ.31,60,000, 58 సంవత్సరాలకు రూ. 33,40,000, 60 సంవత్సరాల కాల వ్యవధికి రూ.34.60 లక్షల మెచ్యూరిటీ లాభాన్ని పొందుతారు.