ఆధార్. ప్రతి భారతీయుని ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది ఒకటి. ఆధార్ తోనే స్కీమ్స్ మొదలు బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడం దాకా ఎన్నో వాటికి ఆధార్ కార్డు కావాలి. అయితే ఆధార్ కార్డు లో కనుక ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడం మంచిది. ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే ఎన్నో వెసులుబాటు చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక యాప్‌ను UIDAI తీసుకొచ్చింది.
ఈ యాప్ ద్వారా సొంతగానే ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్. ఈ యాప్ ద్వారా జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్‌షిప్ స్కీమ్స్, కోవిన్, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు’ అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.
ఆధార్ కార్డు కలిగిన వారి ఆధార్ నెంబర్లు, ఇతర డెమొగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో స్టోర్ చేసుకోవచ్చు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆధార్ కార్డుదారులు ఎక్కడి నుంచి అయినా ఫేస్ అథంటికేషన్ ను పూర్తి చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో యాప్ ఉంటే చాలు.. ఫోన్ ద్వారా మీ ఫేస్ స్కానింగ్‌తో అథంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు.