ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అంతగా జీవితంలో భాగమైపోయింది ఫోన్. అయితే ఫోన్ వాడడం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యాప్స్‌లో మరో మాల్‌వేర్ కలకలం రేపుతోంది. ఆటోలికోస్ అనే పేరుతో మరో కొత్త మాల్‌వేర్‌ను ప్లేస్టోర్‌లోని ఎనిమిది ఆండ్రాయిడ్ యాప్స్‌లో గుర్తించినట్లు గూగుల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూజర్లకు గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది.
వ్లోగ్ స్టార్ వీడియో ఎడిటర్
క్రియేటివ్ 3డీ లాంచర్
వావ్ బ్యూటీ కెమెరా
గిఫ్ ఎమోజీ కీబోర్డ్
ఫ్రీగ్లో కెమెరా 1.0.0
కోకో కెమెరా వీ1.1
రేజర్ కీబోర్డ్
ఫన్నీ కెమెరా
ఇప్పటికే ఈ యాప్‌లను 30 లక్షల మందిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గుర్తించామని, వారంతా వెంటనే వాటిని డిలీట్ చేయాలని ప్లే స్టోర్ సూచించింది. రివైవె, బ్రాటా వంటి బ్యాంకింగ్ మాల్‌వేర్‌ల తర్వాత ఆండ్రాయిడ్‌లో అత్యంత ప్రమాదకరమైన మాల్‌వేర్‌గా సైబర్ సెక్యూరిటీ నిపుణులు వీటిని అభివర్ణిస్తున్నారు.