రాష్ట్రపతి ఎన్నికలు..అందుకే ఓటు వేయలేదన్న వేములవాడ ఎమ్మెల్యే

0
106

రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవడంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నేను ప్రతి సంవత్సరం మూడు నాలుగు సార్లు నా కుటుంబ బాగోగుల కోసం జర్మని వెళ్లిరావడం జరుగుతుంది. 2009 నుంచి నన్ను గెలిపిస్తున్న నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సంగతి తెలుసు.

నాకు జరుగుతున్న చికిత్స కారణంగా రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగులో పాల్గొనలేదు. ముందుగానే మా పార్టీకి అసెంబ్లీ కార్యదర్శికి ఈ సమాచారం ఇచ్చాను. నాకు భారతదేశంలొ గానీ జర్మనీ లో గానీ ఎలాంటి వ్యాపారాలు లేవు. నాకు ఈ ప్రాంతంతో సామాజిక పేగుబంధం ఉన్నది కనుకే రాజకీయాల్లోకి వచ్చాను. నేను ముమ్మాటికి భారతీయుడినే. ఈ అంశం పై గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పులిచ్చాయి. ప్రజాక్షేత్రంలొ వరుసగా నాలుగు సార్లు ఓటమి చెందినవారే నిరాశ, నిస్పృహలతో కోర్టులచుట్టూ తిరుగుతున్నారన్నారు.