హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ బెంజ్ కార్ బోల్తా పడింది. దీనితో అక్కడికక్కడే ఓ యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడు TRS పార్టీ సీనియర్ నాయకులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి కుమారుడు రెగట్టే దినేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.