ఏపీ: రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.40 గంటలకు రామాయపట్నం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నెల్లూరు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.