తెలంగాణాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండడం ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,552 మందికి కోవిడ్ టెస్టులు చేయగా.. 658 మందికి పాజిటివ్ గా తేలింది.
వీటిలో హైదరాబాద్ లో 316 పాజిటివ్ కేసులు నమోదు కాగా…రంగారెడ్డిలో 52, మేడ్చల్‌లో 41 కేసులను గుర్తించారు. ఖమ్మం జిల్లాలో 30 గుర్తించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి.