హైదరాబాద్: ఎల్బీనగర్ లో ఓ 9 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. వర్షిత అనే చిన్నారి మన్సూరాబాధ్ లోని ఒక ప్రైవేట్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతుంది. ఆటోలో ఈ బిల్డింగ్ వద్దకు బాలిక రాగా..అనంతరం నాలుగు అంతస్తుల పైనుండి కింద పడి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.