ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా వైకుంఠపురం, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్నీ. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక తాజాగా పుష్పకి సీక్వెల్ గా పుష్ప పార్ట్-2 కూడా తీయడానికి చిత్రబృందం అన్ని సన్నాహాలు చేస్తూ బన్నీ ఫాన్స్ ను ఖుషి చేస్తున్నారు.
సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ అంటున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 6 నెలల్లో అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ‘పుష్ప 2’లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల, ముంబయి వెళ్లిన దర్శకుడు సుకుమార్.. మనోజ్ బాజ్‌పాయ్‌కి ‘పుష్ప’లోని పాత్ర గురించి వివరించినట్లు, ఆ పాత్రపై ఆయన ఆసక్తి చూపినట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, ఇదే పాత్ర కోసం విజయ్ సేతుపతితో కూడా మాట్లాడరని అంతకుముందు ప్రచారం సాగింది. మరి ఆ అవకాశం మనోజ్‌కే దక్కుతుందా, సేతుపతికా, మరొకరికా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.