నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించింది. అయితే ఈ విచారణ పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోనియాగాంధీపై దాడి అంటే.. తెలంగాణ తల్లిపై దాడి చేసినట్లే.. తెలంగాణ ప్రజలందరూ సోనియాగాంధీకి అండగా నిలబడాలన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టిన సోనియా తెలంగాణ ఇచ్చారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం అని రేవంత్ పేర్కొన్నారు.