‘భర్త కాదు మాజీ భర్త’..చైతూపై సమంత షాకింగ్ కామెంట్స్

0
100

‘కాఫీ విత్ కరణ్’​ షోలో సందడి చేసిన హీరోయిన్ సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్యతో విడాకులు, రూమర్స్, పుష్ప ఐటెం సాంగ్ వంటి వాటి గురించి క్లారిటీ ఇచ్చింది. ‘నాగచైతన్యతో విడిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంది?’ అని వ్యాఖ్యాత కరణ్​ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పింది. అంతేకాకుండా కరణ్​ ఓ ప్రశ్న అడుగుతోన్న సమయంలో.. “నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు?” అని కరణ్‌ అడగ్గా.. ‘భర్త కాదు మాజీ భర్త’ అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

“మేమిద్దరం విడిపోవడం సులభంగా జరగలేదు. విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యా. ప్రస్తుతం బాధ నుంచి బయటపడ్డా. మునుపెన్నడూ లేనివిధంగా దృఢంగా సిద్ధమయ్యా. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం లేదు. ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు, వస్తువులు లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో మా మధ్య సఖ్యత వస్తుందేమో తెలియదు. మేమిద్దరం విడిపోయినప్పుడు నాపై నెగెటివ్‌ ప్రచారం జరిగింది. నేను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు. నేను ఓపెన్‌గా ఉండాలనుకున్నా. అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పా. మేము విడిపోయిన కొన్నిరోజులకే ‘ఊ అంటావా’ సాంగ్‌ ఆఫర్‌ నాకు వచ్చింది. ఆ పాట నాకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్‌ చేశా. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికి ఈ పాట సరైందని, నాలాంటి స్టార్‌ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించా” అని సామ్‌ తెలిపారు.