Flash: విషాదం..ప్రేమజంట ఆత్మహత్య

0
86

తెలంగాణాలో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గండిచెరువు రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వీరి మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలు ఎవరివనే తెలుసుకునే పనిలో పడ్డారు.