Breaking: ప్రజలకు అలెర్ట్..3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు

0
77

నిన్న కురిసిన వర్షం నుండి తెలంగాణా రాష్ట్రం ఇంకా తేరుకోలేదు. ఈలోపే మరో పిడుగులాంటి వార్త వాతావరణశాఖ చెప్పింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది.