ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో నలుగురు కర్ణాటక పోలీసులు అక్కడిక్కడే మృతిచెందిన ఘటన చిత్తూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. వీరు కర్ణాటకు చెందిన పోలీసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.