ఏపీలో విషాదం నెలకొంది. విశాఖలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో డ్రై డాక్ లో పడి యువకుడు మృతి స్థానికంగా కలకలం రేపింది. అతని మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గాజువాక చిన్న గంట్యాడకు చెందిన మైలపల్లి మురళి పెయింటర్ పని చేస్తూ జీవిస్తున్నాడు. తన స్నేహితులతో పడవపై మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో పాడైపోయిన చెక్కపై అడుగు వేసి జారిపడ్డాడు. డ్రై డాక్ నీళ్లు సుమారు 50 అడుగులు లోతుతో బురద ఉండడం ఈత కొట్టడానికి అవకాశం లేకపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని అండర్ వాటర్ సర్వీస్ వాళ్లు అతని కోసం గాలించారు. అయితే అప్పటికే అందులో పడి చాలాసేపు అవ్వడంతో మురళి మృతి చెందాడు.