రోడ్డుపైనే తిష్ట వేసిన ఏనుగు..పట్టించుకోని అటవీ అధికారులు- Video

0
74

తమిళనాడు రాష్ట్రంలో ఓ ఒంటరి ఏనుగు ప్రయాణికులను బెంబేలెత్తించింది. హోసూరు సమీపంలోని డెంకనికోట అంచెట్టి రహదారి పక్కన ఏనుగు 2 గంటల పాటు తిష్ట వేసింది. ఏనుగు ఉన్నంత సేపు వాహన చోదకులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగును చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ ఏనుగు ఎవ్వరిని ఏమి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగు రోడ్డు మీదకి వచ్చిన కానీ డెంకనికోట అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఎవరికైనా ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది అంటూ అధికారులపై స్థానికులు మండిపడ్డారు.

https://www.facebook.com/rajashekar.konda.351/videos/338470465023456