ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 6000 నగదు అందుతుంది.
అయితే ఇప్పటివరకు పదకొండు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది.విడతల వారిగా రూ. 2000 అందిస్తుంది. అయితే తాజాగా పీఎం కిసాన్ పథకంలో కొత్తగా నమోదు చేసుకునేవారికి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. చాలా మంది అర్హులు కాకున్నా ఈ పథకం పొందుతున్నారన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ-కేవైసీ, కేవైసీ రెండు విధానాలు వేర్వేరు. ఓటీపీ ఆధారంగా చేసే విధానాన్ని ఈ-కేవైసీ అంటారు. ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ-కేవైసీని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీని డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి చేస్తారు. ఇంతకు మునుపు కేవైసీ చేయించిన పీఎం కిసాన్ లబ్ధిదారులు మళ్లీ ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధిని కోల్పోనున్నారు.