TS: గుజరాత్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో చోటు చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రుల్లో చేరినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..నలుగురు నిందితులు పోలీసుల చేతులకు చిక్కారు.