రెండు తెలుగు రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. తెలంగాణకు 2022 నాటికి 3 లక్షల 12 వేల 191.3 కోట్ల అప్పుందని తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ కు 2022 నాటికి 3 లక్షల 98 వేల 903.6 కోట్ల అప్పులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020లో తెలంగాణకు అప్పులు 2 లక్షల 25వేల 418 కోట్ల అప్పుండగా.. 2021 నాటికి 2 లక్షల 67 వేల 530.7 కోట్లకు చేరాయని లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు 2020లో 3 లక్షల 7వేల 671. 5 కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పారు. 2021 నాటికి ఏపీ అప్పులు 3 లక్షల 60 వేల 333. 4 కోట్లకు చేరాయన్నారు నిర్మలా సీతారామన్.
అప్పుల్లో తమిళనాడు టాప్ ప్లేస్ లో ఉంది. 6 లక్షల 53 వేల కోట్లతో ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మహారాష్ట్ర 6 లక్షల 8 వేల కోట్లతో అప్పుల్లో మూడో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 5 లక్షల 62 వేల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా 4 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయని నిర్మాలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.