తెలంగాణలో మంకీ ఫాక్స్ కలకలం..నిన్న కామారెడ్డి-నేడు ఖమ్మంలో..

0
77

తెలంగాణాలో మంకీపాక్స్‌ టెర్రర్ పుట్టిస్తుంది. ఇటీవలే కువైట్‌ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్​ లక్షణాలు ఉన్నట్లు తెలవగా..తాజాగా ఖమ్మం నగరంలో కూడా మంకీ ఫాక్స్ కలకలం సృష్టించింది. మంకీ ఫాక్స్ లక్షణాలతో ఓ పేషేంట్ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. దీనితో ఆసుపత్రి ఆసుపత్రి డీఎంహెచ్ఓకి సమాచారం అందించారు. డిఎంహెచ్వో ఆదేశాల మేరకు పేషెంట్ ను హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఆ పేషేంట్ ఉత్తరప్రదేశ్ కి చెందిన సందీప్ అనే వ్యక్తి కాగా అతను ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.