ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద కారు, లారీ ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.