అమ్నీషియా పబ్ రేప్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. హైదరాబాద్ లోని జువైనల్ కోర్టుతోపాటు నాంపల్లి కోర్టులో 600 పేజీలతో చార్జ్‌షీట్లు దాఖలు చేశారు పోలీసులు. 56 రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేయగా..65 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించారు. అలాగే ఎఫ్‌ఎస్‌ఎల్, డీఎన్‌ఏ, సీసీ ఫుటేజ్, ఫోన్ల రికార్డ్, మెసేజ్‌లు, ప్రొటెన్సివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలు పొందుపరిచారు.
కాగా కారులో బాలికపై గ్యాంగ్ రేప్ చేయగా ఈ కేసులో సాదుద్దీన్‌తో పాటు ఎమ్మెల్యే కొడుకుపై అభియోగాలున్నాయి. మొత్తం ఐదుగురు జువైనల్స్‌పై అభియోగాలు రాగ నిందితులు ఉద్దేశపూర్వకంగానే బాలికను పబ్‌లో ట్రాప్ చేసి రేప్ చేశారు. అయితే తమకున్న పలుకుబడి ఉపయోగించి నిందితులు కేసు తప్పుదారి పట్టించారు. కాగా ఇప్పటికే ఐదుగురు జువైనల్స్‌కు బెయిల్ మంజూరు అయింది.