ఇవి తింటే వారంలోనే స్కిన్ మెరిసిపోతుందట..!

0
106

అందమైన చర్మాన్ని పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకోసం అనేక రకాల చిట్కాలు పాటిస్తుంటారు. అయితే ఆరోగ్యాన్ని పొందాలంటే మంచి ఆహారం ఎంత ముఖ్యమో.. అందమైన చర్మం కోసం కూడా ఆహారం కూడా అంతే ముఖ్యం. క్లియర్ స్కిన్ పొందాలంటే కొన్ని ఆహార పదార్థాలు మనరోజువారీ ఆహారం లో తీసుకోవాలని నిపుణులు చేబుతున్నారు.

పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇది చర్మాన్ని స్పష్టంగా ఉంచడంలో సాయపడుతుంది. దీన్ని కూరలు, సూప్స్, ఇతర వంటకాల్లో వాడడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు..అందాన్ని కూడా పెంచుకోవచ్చు. జీలకర్ర కూడా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పసుపు వలె  జీలకర్ర కూడా చర్మాన్ని క్లియర్‌గా ఉంచడంలో సాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అన్నం, కూరగాయలు, మాంసంలో జీలకర్రని వాడడం వల్ల వీటిలో ఉండే ప్రత్యేక గుణాలు మన అందాన్ని అమాంతం పెంచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యాలకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.