Review: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ

0
116

మాస్ మహారాజ్ రవితేజ దూకుడు పెంచారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన హీరో ఖిలాడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా హిట్టా ఫట్టా ఇప్పుడు చూద్దాం..

ఈ సినిమాకు శరత్ మండవ దర్శకుడు కాగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఈ సినిమాలో కీ రోల్ పోషించాడు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కథ ఏంటంటే?

సినిమా కథ మొత్తం 1995లో చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. రామారావు (రవితేజ) ఒక సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. ఎప్పుడూ నిజాయితీగా ఉండే రామారావు ఎర్రచందనం మాఫియా కేసును టేకప్ చేస్తారు. సీఐ జమ్మి మురళి (వేణు తొట్టెంపూడి) కూడా ఇన్వెస్టిగేషన్లో భాగమవుతారు. వీరిద్దరూ కలిసి ఆ ఎర్రచందనం మాఫియా అంతు చూశారా లేదా అనేది సినిమా కథ.

ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ చాలా బాగా నటించారు. అయితే తన పాత్రకు అనుగుణంగా రవితేజ ఎనర్జీ కొంచెం తగ్గినట్లు అనిపించినప్పటికీ రవితేజ పర్ఫామెన్స్ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. దివ్యాన్ష కౌశిక్ మరియు రజిష విజయన్ కూడా చాలా బాగా నటించారు. చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించిన వేణు తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. నాజర్ మరియు నరేష్ లు కూడా తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, పవిత్ర లోకేష్ తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

తన మొట్టమొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు శరత్ మండవ ఒక కంటెంట్ ఉన్న కథను ఎంచుకున్నారు కానీ దానిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవాలి. అసలు ఇంట్రడక్షన్ పవర్ఫుల్ గా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. కథ మొత్తం చాలా ఫ్లాట్ గా బోరింగ్ గా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫామిలీ సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యే విధంగా లేవు. పాటలు అంత బాగా లేకపోయినప్పటికీ, నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

రవితేజ నటన

కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు

నేపథ్య సంగీతం

బలహీనతలు:

నెరేషన్

ఫస్ట్ హాఫ్

రేటింగ్: 2.0/5

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించి. వ్యక్తిగత అభిప్రాయం కాదు.