కడ్తాల్ సమీపంలోని సాయి రెడ్డి గూడెంలో చికోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వున్న పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ లు ఫార్మ్ హౌస్ లో వుండటానికి వీలు లేదు..ఫ్రెండ్లీ గా వుండే పక్షులు వుండొచ్చని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ పేర్కొన్నారు.
అయితే ఫార్మ్ హౌజ్ లో పైథాన్ వుందని సమాచారం వచ్చింది…కానీ అది ఇక్కడ కనిపించట్లేదు.. ఫార్మ్ హౌజ్ అంతా తనిఖీ చేశాము. జూలో స్వేచ్చగా తిరగాల్సిన వాటిని ఇక్కడ బంధించారు. నిబంధనలకు విరుద్ధంగా వున్న జంతువులను గుర్తించి, అనుమతులు తనిఖీ చేస్తాము. ఫార్మ్ హౌజ్ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాము..చికోటి ప్రవీణ్ మామ మాధవ రావ్ ఫార్మ్ హౌజ్ నిర్వాహకుడు చెప్పిన వివరాల ప్రకారం..చికోటి ప్రవీణ్ తనకు ఇష్టమైన పక్షులను మాత్రమే ఇక్కడ పెంచుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి పార్టీలు జరుగవు.. ఇక్కడ వున్న జంతువులు, పక్షులకు అన్ని అనుమతులు వున్నాయని తెలిపాడు.