ఫ్లాష్: కాంగ్రెస్ నేత ఇంట విషాదం

0
99
Hath se Hath Jodo

రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబాల పాలిట కొండంత విషాదాన్ని మిగులుస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట యాక్సిడెంట్ లో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ప్రమాదం ఒకటిగానే కనిపించిన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.  ఇక తాజాగా శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువతిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తనియాగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.