ఇప్పటికే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్, రోజువారీ సరుకులు, నూనె ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో బైక్ ను బయటకు తియ్యాలంటేనే జనం భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇలాంటి వారికీ అదిరిపోయే గుడ్ న్యూస్..ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందే చక్కని అవకాశం మీ కోసం..
మీరు కూడా పెట్రోల్ ఫ్రీగా పొందాలంటే ఇలా చేయండి..
సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్ రూపొందించింది. ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ పేరుతో ఈ క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంది..ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారు ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు. అంటే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపిన లావాదేవీలపై పొదుపు చేసే మొత్తం 68 లీటర్ల పెట్రోల్‌తో సమానం అని సిటీ బ్యాంక్ చెబుతోంది.
ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డుతో జరిపే ట్రాన్సాక్షన్స్‌ని ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇన్‌స్టంట్ లోన్ కూడా పొందొచ్చు. ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ఐడెండిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. రెండు నెలల సాలరీ స్లిప్స్ కూడా ఇవ్వాలి. సిటీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో లేదా దగ్గరిలోని బ్యాంకు బ్రాంచ్ లలో క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు..