స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్‌..ప్రతి ఏడాది స్కాలర్‌ షిప్‌..ఎలా అంటే?

0
84

విద్యార్థుల కోసం ఇండియన్‌ పోస్టల్‌ బంపరాఫర్‌ను ప్రకటించింది. దీన్‌ దయాళ్‌ పథకంలో భాగంగా ‘స్పార్ష్‌ యోజన’ పేరుతో విద్యార్థులకు స్కాలర్‌ షిప్స్‌ను అందిస్తోంది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుకుంటున్న చిన్నారులు ఈ స్కాలర్‌ షిప్‌ పొందడానికి అర్హులు.

మొత్తం 920 మందికి స్కాలర్‌ షిప్‌లను అందించనున్నారు. ప్రతి పోస్టల్‌ సర్కిల్‌కు 40 స్కాలర్‌ షిప్స్‌ చొప్పున అందించనున్నారు. నాలుగు నెలకొకసారి రూ. 1500 చొప్పున, ఏడాదికి రూ. 6000ను అందిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా..

6 నుంచి 9వ తరగతి చదువుతోన్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్‌కు అర్హులు.

అకడమిక్‌ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులను ఫిలాటెలీ రిటన్‌ క్విజ్‌, ఫిలాటెలీ ప్రాజెక్ట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫిలాటెలీ), చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌, తెలంగాణ సర్కిల్‌, డాక్‌ సదన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-500001 అడ్రస్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల స్వీకరణకు 26-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణ పోస్టల్‌ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఫిల్‌ చేసి ఆఫ్‌లైన్‌ విధానంలో సబ్‌మిట్ చేయాలి.