ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమా మహేశ్వరి మృతిపై వైసీపీ చేసిన కామెంట్లకు నారా లోకేష్ కౌంటర్ వేశారు. జగన్ కు ఎక్స్‌పెయిరీ డేట్ దగ్గర పడిందని, టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డి తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారన్నారు. డోర్ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.