థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తూర్పు థాయ్‌లోని చోన్బురి ప్రావిన్స్‌లోని సత్తాహిప్ జిల్లా సమీపంలో గల మౌంటెన్ బి నైట్ క్లబ్లో గురువారం ఈ ప్రమాదం జరిగింది.
రాయ్‌చూర్ జిల్లా లింగసుగుర్ మండలం హట్టి గ్రామానికి చెందిన మహ్మద్ మఝర్ హుసేన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వచ్చారు. కొడంగల్ సమీపంలోని ఓ దర్గాను దర్శించుకుని గురువారం రాత్రి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గురమిత్కల్ మండలం అరెకేరా వద్ద వారి కారును.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. 6 నెలల చిన్నారితో పాటు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడ్ని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.