అలెర్ట్..నేటి నుంచి ‘అగ్నిపథ్‌’ దరఖాస్తుల స్వీకరణ

-

త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకు వచ్చేందుకుగాను ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది.

- Advertisement -

ఇక తాజాగా అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు నేటి నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ విభాగంలో పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు.

ఇందులో భాగంగా భారత సైన్యం ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్‌ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...