గుడ్ న్యూస్..తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్

0
92

తెలంగాణ వైద్యారోగ్యశాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1326 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వీటిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టరేట్‌లో) (751), ట్యూటర్లు (మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌లో) (357), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-జనరల్‌/ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (టీవీవీపీ) (211), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో) (07) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌/ తత్సమాన ఉత్తీర్ణత. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను మొదట ఎంబీబీఎస్‌ సాధించిన మెరిట్‌ మార్కులకు 80 పాయింట్లు కేటాయిస్తారు. అనంతరం అనుభవం ఆధారంగా 20 పాయింట్లు కేటాయిస్తారు.

ఎంపికైన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు జీతంగా అందిస్తారు. ట్యూటర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 2022 జులై 15న మొదలుకాగా ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది.