నాగార్జున కొత్త సినిమా ఆ హిట్ సినిమా డైరెక్టర్ తోనా..!!

నాగార్జున కొత్త సినిమా ఆ హిట్ సినిమా డైరెక్టర్ తోనా..!!

0
93

మన్మధుడు సినిమా ఫ్లాప్ తర్వాత నాగార్జున తను చేయబోయే కొత్త చిత్రం పై ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు తన తోటి సీనియర్ హీరోలు సినిమాల మీద సినిమాలు చేస్తుంటే నాగ మాత్రం ఒక్కో సినిమా చేస్తూ ఉంటున్నాడు.. తాజాగా అయన మహర్షి సినిమా కి రైటర్ గా పనిచేసిన సోలోమన్ దర్శకత్వంలో ఓ సినిమా లో చేయబోతున్నట్లు తెలుస్తుంది..

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన ‘మహర్షి’ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి కథ అందించింది హరి, సోలోమన్. ‘మహర్షి’ సినిమా తో సక్సెస్ అందుకున్న సోలమన్ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నట్లు సమాచారం. ఈ మధ్యనే సోలమన్. నాగార్జుకి ఒక స్క్రిప్ట్ కూడా వినిపించాడట.

ఈ కథ నాగార్జున కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి. సోలోమన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాడట.