3 రోజుల్లో చంపేస్తాం..సీఎంకు బెదిరింపు మెసేజ్ కలకలం

0
88

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ వచ్చిన ఓ మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి సీఎంను మూడు రోజుల్లో చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. బాంబు దాడులు చేస్తామంటూ లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోకి హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ కు ఆగస్టు 2వ తేదీన మెసేజ్ పంపించారు. దీనితో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.