మోడల్‌ స్కూల్స్‌లో పోస్టులు..రాత పరీక్షలేకుండానే ఎంపిక

0
99

ఏపీ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ) పోస్టులు 71, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీ) పోస్టులు 211 వరకు ఉన్నాయి.

పోస్టును బట్టి ఇంగ్లిష్‌/సివిక్స్‌/కామర్స్‌/ఎకనామిక్స్‌/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బోటనీ/ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లైడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అలాగే దరఖాస్తుదారుల వయసు 44 ఏళ్లకు మించరాదు.

టీజీటీ పోస్టులు:

జోన్‌ 1లో 17

జోన్‌ 3లో 23

జోన్‌ 4లో 31

పీజీటీ పోస్టులు:

జోన్‌ 1లో 33

జోన్‌ 2లో 4

జోన్‌ 3లో 50

జోన్‌ 4లో 124

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఆగ‌స్టు 17, 2022.

ప్రొవిజనల్‌ సీనియారిటీ లిస్టు ప్రకటన తేదీ: ఆగస్టు 23, 2022.

అభ్యంతరాల స్వీకరణ తేదీలు: ఆగస్టు 24 నుంచి 25 వరకు

ఇంటర్వ్యూ లిస్టు విడుదల తేదీ: ఆగస్టు 29, 2022.

వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహణ తేదీ: నవంబరు 8, 2022.

అభ్యర్థుల జాయినింగ్‌ తేది: నవంబరు 9, 2022.