చిరు సైరా టికెట్స్……చిరు నా మజాకా

చిరు సైరా టికెట్స్......చిరు నా మజాకా

0
89

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం మేనియా మొదలైంది.. ఇప్పట్నుంచే థియేటర్స్ వద్ద హంగామా మొదలైంది.. ఖైది నెంబర్ 150 తర్వాత చిరు చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉండగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఓ ఎపిక్ లాగా తీర్చి దిద్దాడు.. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుక్కింగ్స్ మొదలయ్యాయి. బెంగుళూరు, పంజాబ్ లోని ఫగ్వారా అనే ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా కొన్ని నిమిషాల్లోనే టికెట్లు మొత్తం అయిపోయాయి. తాజాగా చెన్నైకి సమీపంలోని తిరుపూరుర్ అనే పట్టణంలోకూడా సైరా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. విడుదల రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రదర్శించే స్పెషల్ షోకి సంబంధించిన టికెట్లన్నీ అయిపోయాయి.

ఆ ప్రాంతంలో హిందుస్థాన్ యూనివర్సిటీ ఉంది. అందులో మెగా అభిమానులు అధికసంఖ్యలో ఉన్నారు. టికెట్లు అన్ని అయిపోవడానికి ఇదే కారణం అని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనే ఇలా ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.