నిరుద్యోగుల గుడ్ న్యూస్. ఇండియన్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే కింద రెండు ప్రాంతాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు.
మొత్తం 60 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
వీటిలో ఎస్సీ కు 15, ఎస్టీ కు 7.5, ఓబీసీలకు 27 శాతం పోస్టులను కేటాయించనున్నారు.
మిగిలిన పోస్టుల్లో దివ్యాంగుల కోటా కింద 10 శాతం, ఈడబ్ల్యూఎస్ కింద మరో 10 శాతం ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ కింద మరో 10 శాతం పోస్టులను కేటాయించనున్నారు. వీటికి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరని.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు.
నెలకు జీతంగా రూ. 30వేలు ఇవ్వనున్నారు. అర్హత విషయానికి వస్తే మూడు సంవత్సరాలపాటు బీఎస్సీలో హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ముఖ్యంగా 2021, 2022లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థి యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.