Breaking news: క్షమాపణలు చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (వీడియో)

0
93

మునుగూడలో కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. రాజగోపాల్ రాజీనామా తరువాత మునుగోడులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. దయాకర్ వ్యాఖ్యలపై వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు మీడియా ముందుకు వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు క్షమాపణ చెప్పిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి కోమటిరెడ్డికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి చర్యలు, బాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన వెంకటరెడ్డిని అవమానించేలా ఎవరు మాట్లాడిన తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుందని వీడియోలో రేవంత్ పేర్కొన్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/rajashekar.konda.351/videos/405176855043368